వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. వైఎస్ వివేకా తనయ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరి తో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయి.సునీల్ యాదవ్ గూగుల్ టెకౌట్ లొకేషన్ ఆధారంగా హత్య కు ముందు అవినాష్ ఇంట్లో ఉన్నాడు. అవినాష్ రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ పలుమార్లు వెళ్ళాడు. 2017 ఎం ఎల్ సి ఎన్నికలలో వివేకా ని కావాలనే ఓడించారు. 2019 ఎంపీ ఎలక్షన్స్ లో వివేకా కు టికెట్ ఇస్తున్నారననే సమాచారం తో హత్య చేశారు. హత్య గురించి అవినాష్ రెడ్డి కి ముందే తెలుసు అని ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
హత్య చేశాక అందరిని అవినాష్ కాపాడుకుంటాడాని ఎర్ర గంగి రెడ్డి మిగిలిన నిందితులకు చెప్పాడు.వివేకా మరణం వార్త ను మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోవాలని వేచి చూశారు.రాజశేఖర్ రెడ్డి తమ్ముడు శివ ప్రకాష్ రెడ్డి వివేకా మరణ వార్తను అవినాష్ కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి 2 నిమిషాల్లోనే వివేక ఇంటికి వెళ్లారు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, తదితరులు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ అవినాష్ రెడ్డి ఇంట్లో చూపించింది. వివేకా ఇంటికి వచ్చిన శశికళ కి గుండె పోటుతో చనిపోయినట్లు అవినాష్ చెప్పాడు. పోలీసులకు సైతం వివేకా గుండె పోటుతో పాటు, రక్తపు వాంతులతో చనిపోయినట్లు చెప్పాడు. హత్య కాదు , సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గంగాధర్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో కీలక అంశం బయట పడింది. వివేకా ను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాష్ చెప్పినట్లు గంగాధర్ స్టేట్మెంట్ ఇచ్చాడు
మాజీ సీఐ శంకరయ్య స్టేట్మెంట్ కీలకంగా మారింది. వివేకా గుండె పోటుతో చనిపోయాడని స్వయంగా అవినాష్ కాల్ చేసి చెప్పాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. విచారణకు సహకరించకుండా అవినాష్ రెడ్డి కోర్టులలో తప్పుడు కేసులు వేస్తున్నాడు. ఆధారాలు లేని ఆరోపణలు నాపై, నా కుటుంబం పై అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడు. పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్న అధికారులపై కూడా అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడు. ఏపీ అధికారులు వారి పలుకుబడి ఉపయోగించి అవినాష్ ను కాపాడాలని చూస్తున్నారు.సీఐ శంకరయ్య, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంవీ కృష్ణ రెడ్డి, గంగాధర్ రెడ్డి లతో తప్పుడు ఆరోపనలు చేస్తూ సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయిస్తున్నారు.అవినాష్ విచారణ సందర్భంగా ఆడియో , వీడియో అవసరం లేదు. నామీద నా కుటుంబం మీద ఆరోపణలు చేశారు కాబట్టే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాను.
Read Also: Siddharth-Aditi: ఇక్కడ పవిత్ర- నరేష్.. అక్కడ సిద్దార్థ్- అదితి.. పవిత్ర బంధమట