Site icon NTV Telugu

Ys Sharmila: ఇవాళ బ్లాక్ డే.. పాదయాత్ర కొనసాగిస్తా

Sharmila 1

Sharmila 1

టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈరోజు బ్లాక్ డే..ఆర్ఎస్ గుండాల తోపులాటలో నాకు గాయం అయ్యింది. కేసీఆర్ కు సిగ్గు ఉండాలి… కేసీఆర్ కు ఇంగితం ఎలాగూ లేదు. బందిపోట్ల రాష్ట్ర సమితి అని మండిపడ్డారు. టీఆర్ఎస్ గుండాలు మమ్మల్ని ఎవర్ని వదిలి పెట్టలేదన్నారు. లోటస్ పాండ్ లో షర్మిల మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం నిలబడితే నాకు శిక్ష వేశారు. అన్ని పార్టీలు కాలయాపన చేస్తూ రాజకీయాలు చేస్తుంటే ప్రజా సమస్యలపై వైసీపీటీపీ పోరాటం చేస్తోంది. ప్రజా సమస్యలను మా భుజాలపై వేసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో లోటస్ పాండ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Read Also:Team India: పంత్.. ఇదేం ఆటతీరు? ప్లీజ్ రెస్ట్ తీసుకో..!!

ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3500 కిలోమీటర్లలో రుణమాఫీ, ఫీజు రియంబర్స్ మేంట్స్, ఉచిత ఎరువులు, పోడు పట్టాలు ఇస్తామని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మర్చిపోయారు. ప్రజలు మా పార్టీ పై చూపిస్తున్న ఆదరాభిమానాలను ఓర్వలేక నన్ను అరెస్టు చేశారు. కనీసం ఆఫ్ఘనిస్తాన్ లో కొంచెమైన న్యాయం ఉంటుందేమో… కానీ తెలంగాణలో ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఉద్యమకారులు ఉండేవారు. టీఆర్ ఎస్ పార్టీలో నాయకులు గుండాలు, రౌడీలుగా మారారు. మీకు అధికారంలో ఉండే హక్కు ఎవరిచ్చారు. నాకు పాదయాత్ర చేసే అనుమతి ఉంది. దుండగులు వేల మంది మా పాదయాత్ర లోకి వచ్చారు. పోలీసులను జీతగాళ్ళలా మార్చుకున్నారు. ఎవరి దగ్గర జీతాలు తీసుకుంటున్నారు. బీజేపీకి ఆర్ఏస్ఎస్ లా… టీఆర్ఎస్ కు పోలీసులు అలా తయారైయ్యారు. ప్రజల పక్షాన నిలబడటం తప్పా అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Read Also: Coins In Stomach: ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్.. కడుపా లేదా కిడ్డీ బ్యాంకా ?

అంతకుముందు నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల నైట్ హాల్ట్ బసచేసే బస్సును టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తగలబెట్టారు. అడ్డొచ్చిన కార్యకర్తలపై దాడులు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై షర్మిల మండిపడ్డారు.

Exit mobile version