NTV Telugu Site icon

YS Sharmila: మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నా.. సంతోషంగా ఉంది

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే నా ప్రయణం.. ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను అన్నారు వైఎస్‌ షర్మిల.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు షర్మిల.. ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు ఖర్గే, రాహుల్‌, ఏపీసీసీ చీఫ్ గుడుగు రుద్రరాజు.. ఇక, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)ని విలీనం చేశాం అన్నారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. వైఎస్సార్‌ జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నాను అన్నారు.

Read Also: BJP: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు..

ఇక, దేశంలో అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్సే అన్నారు వైఎస్‌ షర్మిల.. మణిపూర్‌లో 2వేల చర్చిలను ధ్వంసం చేసిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు.. దీని ప్రధాన కారణం దేశంలో కాంగ్రెస్‌ పార్టీ లాంటి సెక్యూలర్‌ పార్టీ అధికారంలో లేకపోవడమే అన్నారు.. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్న షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా.. తన శక్తి మేరకు పనిచేస్తానన్నారు.. మరోవైపు.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలన్నది మా నాన్న వైఎస్సార్‌ కల.. అది సాకారం చేసేందుకు తనవంతు కృషి ఉంటుందన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చింది. జోడో యాత్ర ప్రజలతోపాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.. ఇక, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు వైఎస్‌ షర్మిల.

Show comments