Site icon NTV Telugu

YS Sharmila: పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల నియామకం.. కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటన

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న తర్వాత ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగింది.. త్వరలోనే ఆమెకు పీసీసీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే వైఎస్‌ షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమించింది కాంగ్రెస్‌ అధిష్టానం.. వైఎస్‌ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌.. ఇదే సమయంలో.. సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.

Read Also: Tenali: టీడీపీ-జనసేన పొత్తు.. తెనాలిలో చిచ్చు..! సీటు ఇవ్వకపోతే రెబల్‌గా బరిలోకి..!

కాగా, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి.. వైఎస్ షర్మిలకు లైన్‌ క్లియర్‌ చేసిన విషయం విదితమే.. మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్‌ షర్మిలకు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చారని.. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నమాట.. గిడుగు రుద్రరాజుతో రాజీనామాతో వైఎస్‌ షర్మిలకు లైన్‌ క్లియర్‌ కాగా.. ఈ రోజు వైఎస్‌ షర్మిలనకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించింది కాంగ్రెస్‌ అధిష్టానం. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా మారిపోయింది.. కానీ, వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రేస్‌లోకి తీసుకొచ్చేందుకు అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించిందంటున్నారు విశ్లేషకులు.. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్‌ షర్మిల బిజీగా ఉన్న విషయం విదితమే.

Exit mobile version