NTV Telugu Site icon

YS Jagan: హర్యానా ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్..

Ys Jagan

Ys Jagan

హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.. ఏపీలో లాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని.. హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.. పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం సమర్ధనీయం కాదన్నారు. దేశంలో పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ బ్యాలెట్‌లనే వాడుతున్నారు.. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయని అన్నారు. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ కే వెళ్లటం మంచిది.. అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుంది.. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని వైఎస్ జగన్ కోరారు.

Read Also: Avocado Benefits: అవొకాడోతో మెదడుకు ఎంత మేలు..!

కాగా.. హర్యానా ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసింది. పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్.. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపుతో వెనుకబడింది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గానూ.. బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమైంది.