Site icon NTV Telugu

YS Jagan: పులివెందలలో పర్యటించనున్న మాజీ సీఎం జగన్

Ys Jagan

Ys Jagan

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం (మార్చి 24) పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన లింగాల మండలంలో ఇటీవల తీవ్ర ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలించనున్నారు. రైతుల కష్టాలను నేరుగా తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు జగన్ ఈ పర్యటనకు సిద్ధమయ్యారు.

Read Also: Water from air: గాలి నుంచి నీరు తయారు చేస్తున్న భారతీయ సంస్థ.. ఎలా సాధ్యం..?

పర్యటన వివరాల విషయానికి వస్తే.. ఉదయం 8.30 గంటలకు– వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలానికి చేరుకుంటారు. లింగాల మండలంలో ఇటీవల తుఫాను ప్రభావంతో వేల ఎకరాల్లో అరటి తోటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనిస్తారు. ఆపై నష్టపోయిన అరటి రైతులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇక రైతులతో చర్చ అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

Read Also: SRH vs RR: సొంత గడ్డపై సన్‌రైజర్స్ ఘన విజయం.. ఐపీఎల్‌ చరిత్రలో మరో రికార్డు..

ఈదురుగాలులు, వర్షాల వల్ల లింగాల మండలంలో పంట నష్టం తీవ్రమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా అక్కడి రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రైతులకు ఏమైనా భరోసా ప్రకటిస్తారా? ప్రభుత్వాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తారా? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.

Exit mobile version