YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Review Tobacco Procurement at Devarapalli: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ జరుగుతున్న కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు. అనంతరం పొగాకు రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడ పొగాకు కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి.. సంబంధిత అంశాలపై ఆరా తీస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న జగన్.. పంట సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధరలు, కొనుగోళ్ల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై వారితో నేరుగా చర్చించనున్నారు.
Also Read
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
వైఎస్ జగన్ పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతుల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా తెలుసుకుని.. వాటిపై స్పందించే అవకాశం ఉంది. రైతులతో ముఖాముఖి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం దేవరపల్లి నుంచి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!