NTV Telugu Site icon

YS Jagan: నేడు వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

Jagan

Jagan

YS Jagan: నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పెందుర్తి, నర్సీపట్నం,పాయకరావుపేట నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బొత్స గెలుపుపై ఎంపీటీసిలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వైఎస్‌ జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Read Also: TDP: నేడు టీడీపీ పొలిట్‌ బ్యూరో భేటీ.. మిషన్ -2029కు ప్రణాళికలు!

కాగా, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో వేర్వేరుగా సమావేశమ­య్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్‌ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.. విలువలు పాటిస్తూ పోటీకి పెట్టే వాళ్ళం కాదన్నారు. సంఖ్యాబలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందన్నారు. 380 పైచిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీకి దిగుతోందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడని.. రాజకీయాల్లో విలువలను మరింత దిగజారుస్తున్నాడని ఆరోపించారు. విలువులు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు, మన ఇంట్లోకూడా మనకు విలువ తగ్గుతుందన్నారు.