YS Jagan suspends Hindupur ycp leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది. వైసీపీలో ఈ కీలక పరిణామం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.
కొండూరు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ చాలా ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం సమయంలో హిందూపురం తొలి వైసీపీ ఇన్చార్జిగా వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. మరోవైపు హిందూపురంలో నవీన్ నిశ్చల్ బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2014లో నందమూరి బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి కొండూరి దీపిక పోటీ చేసి ఓడారు. దీపికకు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ అండగా నిలబడ్డారు.
Also Read: Crime News: వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రియుడు!
అయితే 2029 ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందని నవీన్ నిశ్చల్ ఇటీవల ఓ కార్యక్రమంలో బహిరంగ ప్రకటన చేశారు. నవీన్ బహిరంగ ప్రకటనతో దీపిక వర్గం అసంతృప్తి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దీపిక ఫిర్యాదుతోనే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇద్దరు కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేయడం ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
