Site icon NTV Telugu

YS Jagan: ఏపీలో తాజా పరిణామాలపై జగన్‌ సంచలన ట్వీట్..

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా సంచలన ట్వీట్‌ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ ఫైర్‌ అయిన ఆయన.. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు భంగం కలుగుతోంది.. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది. పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారు.. పోలీసు రాజ్యంమా? నియంతృత్వ రాజ్యమా? అన్నట్టుగా మారింది అంటూ ఆరోపణలు గుప్పించారు.

Read Also: Radhika Yadav Murder: టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!

చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అణచివేతలు, అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.. ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు వైఎస్‌ జగన్‌.. ప్రతిపక్షం, ప్రజలు, నిరసనకారుల గొంతును రాష్ట్రంలో నులుమేస్తున్నారన్న ఆయన.. గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్టు చేశారు. పల్నాడులో పోలీసు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్తే ఐదు కేసులు నమోదు చేశారు. 131 మందికి నోటీసులు జారీ చేశారు.. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారు అంటూ ధ్వజమెత్తారు..

Read Also: CM Chandrababu: మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చిన సీఎం.. ఆనందానికి అవదులు లేవు అంతే..!

ఇక, బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించటానికి వెళ్తే ఇప్పటికే ఐదు కేసులు పెట్టి, 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.. రెండు రోజులుగా వారిని అరెస్టు చేసినట్లు చూపించటంలేదు, కోర్టు ముందు హాజరుపరచలేదు.. ప్రతి కేసులోనూ మరికొందరు అని రాస్తూ వారిష్టం వచ్చినట్టుగా వైసీపీ కేడర్ ని అక్రమంగా ఇరికిస్తున్నారని విమర్శించారు జగన్‌.. నా ప్రతి పర్యటనలోనూ ఇలాంటి అక్రమ కేసులు పెట్టటమే కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానీయకుండా చేసే కుట్రలు చేస్తున్నారు.. లాఠీ ఛార్జీలు చేస్తూ ఆంక్షలు పెడుతూ అణచివేత కార్యక్రమాలు చేస్తున్నారు.. ప్రతిపక్షాన్ని బెదిరించి, అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది.. ఇందుకోసం పోలీసు వ్యవస్థను వాడుకోవటం సరికాదంటూ ట్వీట్‌ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..

Exit mobile version