YS Jagan: పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి.. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం!
- పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ
- పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని పరిశీలకులకు జగన్ సూచన
- వచ్చే ఏడాది ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని.. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఈరోజు వైసీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు.
‘మీరంతా సమర్థులని భావించి మీకు ఈబాధ్యతలు అప్పగించడం జరిగింది. పార్టీ నిర్మాణంపై మీరు దృష్టిపెట్టాలి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టిపెట్టాలి. రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారు. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడగలగాలి. మీరు పరిశీలకుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎంత మందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీమీ పనితీరు ఆధారంగా మీకు మంచి మంచి పదవులు వస్తాయి. వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దాం, బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం. బూత్ కమిటీలు పూర్తయ్చేసరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షలమంది ఉంటారు’ అని వైఎస్ జగన్ చెప్పారు.
Also Read
‘రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర అందడం లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితాను పెట్టేవాళ్లం. ఎంఎస్పీ కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. పొగాకు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొన్నాం.. రైతులను ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానానికి ఎంఎస్పీ ఇవ్వడమే కాదు, ఎంఎస్పీకి అదనంగా జీఎల్టీ కూడా ఇచ్చాం. వ్యవసాయరంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పంటలకు నష్టం వస్తే సీజన్ మగిసేలోగా వారికి ఇన్పుట్ సబ్పిడీ ఇచ్చేవాళ్లం. మళ్లీ సీజన్‌లోగా పరిహారిం ఇచ్చేవాళ్లం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించేవాళ్లం’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?