Site icon NTV Telugu

YS Jagan: పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి.. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం!

Ysjagan

Ysjagan

మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్‌ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజినల్‌ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని.. రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈరోజు వైసీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు.

‘మీరంతా సమర్థులని భావించి మీకు ఈబాధ్యతలు అప్పగించడం జరిగింది. పార్టీ నిర్మాణంపై మీరు దృష్టిపెట్టాలి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్‌ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టిపెట్టాలి. రీజినల్‌ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారు. రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడగలగాలి. మీరు పరిశీలకుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎంత మందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీమీ పనితీరు ఆధారంగా మీకు మంచి మంచి పదవులు వస్తాయి. వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దాం, బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం. బూత్‌ కమిటీలు పూర్తయ్చేసరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షలమంది ఉంటారు’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

‘రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర అందడం లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితాను పెట్టేవాళ్లం. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. పొగాకు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొన్నాం.. రైతులను ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానానికి ఎంఎస్‌పీ ఇవ్వడమే కాదు, ఎంఎస్‌పీకి అదనంగా జీఎల్టీ కూడా ఇచ్చాం. వ్యవసాయరంగంపై ఇంత ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్‌ పెట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పంటలకు నష్టం వస్తే సీజన్‌ మగిసేలోగా వారికి ఇన్‌పుట్‌ సబ్పిడీ ఇచ్చేవాళ్లం. మళ్లీ సీజన్‌లోగా పరిహారిం ఇచ్చేవాళ్లం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించేవాళ్లం’ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version