Site icon NTV Telugu

YS Jagan: అచ్యుతాపురం ప్రమాదంపై మాజీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Jagan

Jagan

YS Jagan: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని కోరారు. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపి.. మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version