YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు పులివెందులలోనే వైసీపీ అధినేత ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. జగన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పులివెందులకు చేరుకోనున్నారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను కలుసుకుని వారి సమస్యలను, వినతులను స్వీకరించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు.
రేపు ఉదయం వైఎస్ జగన్ తన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా నివాళులు అర్పించనున్నారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Also Read
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!