NTV Telugu Site icon

YS Jagan: చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jagan

Jagan

YS Jagan: హైదరాబాద్‌ శివారులో.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు ఎంతో విశిష్టత ఉంది.. అయితే, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. రామరాజ్యం పేరుతో.. ఓ అర్చకుడిపై దాడి చేయడం ఏంటి అంటూ.. అంతా ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. రంగరాజన్‌కు ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్.. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమైన విషయం అన్నారు వైఎస్‌ జగన్‌..

Read Also: CM Chandrababu: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మిర్చి రైతులను ఆదుకోండి..

కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని చిలుకూరు బాలజీ ఆలయం సమీపంలోని రంగరాజన్‌ నివాసానికి వచ్చిన పలువురు వ్యక్తులు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరడం… అందుకు ఆయన నిరాకరించడం.. ఆ తర్వాత రంగరాజన్‌తో పాటు ఆయన కుమారుడిపై దాడి చేయడం.. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురిని అరెస్ట్‌ చేసిన విషయం విదితమే..