YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష హోదా గుర్తింపుపై చర్చ సాగుతూనే ఉంది.. ఇక, అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కావాలంటే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి కూడా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంది.. మరోవైపు.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
Read Also: Lady Super Star : ఒకప్పుడు యాడ్స్, ప్రమోషన్లకు నో.. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్స్.. ఇంతలో ఎన్ని మార్పులో
తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు జగన్.. ఈ రూలింగ్ రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. ఈ రూలింగ్ ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ చట్టంలో సెక్షన్ 12బీ కి విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు జగన్.. అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి తనను ప్రతిపక్ష నేతగా హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. అయితే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది.. ఓవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. జగన్.. మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..
