Site icon NTV Telugu

YS Jagan: ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌ ప్రమాణం..

Jagan

Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ఈ రోజు, రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. తొలి రోజు శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత వరుసగా మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, భరత్‌, దుర్గేష్‌, ఫరూఖ్‌, జనార్థన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌, నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌, నారాయణ, పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, రామ ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్‌ యాదవ్‌, సవిత.. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఇక, మంత్రుల ప్రమాణం తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు వైఎస్‌ జగన్‌.. మరోవైపు.. ఇంగ్లీష్‌ ఆల్బాబెట్‌ల ప్రకారం సభ్యులతో ప్రమాణం చేస్తున్నారు ప్రొటెంస్పీకర్‌ బుచ్చయ్య చౌదరి.. కాగా, అసెంబ్లీ ప్రారంభానికి ముందే.. తన చాంబర్‌కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. తాను ప్రమాణస్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు.. ఇక, ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తన చాంబర్‌కు తిరిగి వెళ్లిపోయారు.. అక్కడి నుంచి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు వైఎస్‌ జగన్‌.

Exit mobile version