Site icon NTV Telugu

CM Jaganmohan Reddy: రేపు జగనన్న తోడు.. చిరు వ్యాపారులకు ఆర్థిక ఆసరా

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

ఏపీలో మరో పథకానికి సంబంధించి ఆర్థిక చేయూతకు రంగం సిద్ధం అవుతోంది. జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ప్రభుత్వం ఆర్ధిక చేయూత పథకంలో భాగంగా బుధవారం సీఎం జగన్ (Jagan mohan reddy)ప్రారంభిస్తారు. చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.

గత ఆరు నెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ రీఇంబర్స్‌మెంట్‌ను రేపు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. పూర్తి వడ్డీ భారం భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం. రేపు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ది చేకూరుతుంది. ఇప్పటి వరకు 15,03,558 లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,011 కోట్లుగా ప్రభుత్వం తెలిపింది. పల్లెల్లో, పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేస్తూ సేవలందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకాన్ని 2020లోనే జగన్ ప్రారంభించారు. మిగతా పథకాల లాగే ఈ పథకం కూడా నిరాటంకంగా కొనసాగుతోంది.

జగన్ పాదయాత్ర సమయంలో వీధి వ్యాపారాలు చేసుకునే వారిని చూసి, వారి కష్టాలకు చలించి కదిలిపోయారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఆర్థిక చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకున్నారు సీఎం జగన్. ఏటా క్రమం తప్పుకుండా వారికి 10 వేల రూపాయలు అందిస్తున్నారు. వీధి వ్యాపారులు తమ వ్యాపారానికి కావల్సిన పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతుంటారు.

రుణాలు దొరకకపోవడంతో ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యాపారాలు చేస్తూ అదనపు భారం మోస్తుంటారు. ఈ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని ఇచ్చిన హామీని మూడో ఏడాది కూడా అమలు చేస్తున్నారు. వీధి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా.. అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను వారి వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. జగన్ చేపట్టిన ఈ పథకం తమకు ఎంతగానే ఉపయోగపడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.

K.A. Paul : అక్రమ కుటుంబ, కుల రాజకీయాలు చేస్తున్నారు..

Exit mobile version