NTV Telugu Site icon

YS Jagan: ఏపీ గవర్నర్‌తో మాజీ సీఎం జగన్ భేటీ

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్‌తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు తెలిపారు. కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. దాడులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు గవర్నర్‌ జస్టిస్ అబ్దు్ల్‌ నజీర్‌కు జగన్ చూపించారు.

Read Also: Heavy Floods: ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి.. గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం

 

Show comments