YS Jagan: మనలో పోరాటపటిమ తగ్గకూడదు అంటూ ఎంపీలకు సూచించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్.. నా వయసు చిన్నదే.. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు.. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు అన్నారు.. నా వయసు చిన్నదే.. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు… మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చే శారు.. 14 నెలలు పాదయాత్ర చేశాను.. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. ఇక, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.. కానీ, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి టీడీపీ కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదన్నారు.
Read Also: UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలో తెలుసా?
వైయస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయి. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయన్నారు వైఎస్ జగన్.. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే.. సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుందన్నారు. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుందన్నారు.
Read Also: UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలో తెలుసా?
ఇక, పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు.. టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదే.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నారు వైఎస్ జగన్.. మరోవైపు, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు.. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారు.. కానీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు జగన్.. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని అడుగులు ముందుకేయాలి. పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోండి. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలి. మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయి. పార్టీకోసం మీరు కష్టపడండి.. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్.
