NTV Telugu Site icon

YS Jagan : లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు

Jagan

Jagan

టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా అని, తిరోగమనంలో వెళ్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు జగన్‌. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి అని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబు కి లేదన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని, మోసపూరిత హామీలపై నిధులను బడ్జెట్ లో చూపించక పోతే ప్రజలు రోడ్డు పైకి వచ్చి ఆందోళనకు దిగుతారు అని చంద్రబాబుకు తెలుసునన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు ఇలా చేస్తున్నారని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుంది అని ఇలా చేస్తున్నారన్నారు.

Raghunandan Rao: వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి ?

అంతేకాకుండా..’ప్రజలను భయానక వాతావరణంలో ఉంచటానికి దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు వంచెన, గోబెల్స్ ప్రచారం అనే విధానం ఫాలో అవుతారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే విధంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినపుడు, బీజేపీతో కలిసి వెళ్ళటానికి, బీజేపీ నుంచి విడిపోవటానికి ఇలా ప్రతిసారి చంద్రబాబు అనుసరించే విధానం ఇదే. రాష్ట్రం ఆర్దికంగా ధ్వంసం అయిందనే కథని ఇటీవల చంద్రబాబు ఎక్కువగా చెబుతూ వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఇదే ప్రయత్నం చేస్తున్నారు. 14 లక్షల కోట్లు ఉన్నాయి అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు’ అని వైఎస్‌ జగన్‌ వ్యా్‌ఖ్యానించారు.

Sessions of Parliament: పార్లమెంట్ లో అమరవీరులకు ఘన నివాళ్లు.. మౌనం పాటించిన సభ్యులు