Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Fires On Police After Consoles Jhon Victors Family

YS Jagan: కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇస్తారా…?

Published Date :June 3, 2025 , 2:44 pm
By Sudhakar Ravula
  • గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన..
  • రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్‌ కుటుంబాలకు పరామర్శ..
  • ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ సీఎం..
YS Jagan: కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇస్తారా…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని పోలీసులు, ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. గుంటూరు జిల్లా తెలానిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్‌ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టులో హాజరుపర్చే ముందు హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది.. గాయాలు చూపిస్తే డాక్టర్లు నోట్ చెయ్యలేదు? అని ప్రశ్నించారు.. మెడికో లీగల్ కేసు అవుతుందని ఇలా చేశారా..? పోలీసులు డాక్టర్ ను బెదిరించి ఉండాలి.. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే.. మంచివారైన పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేశారు.. చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే.. పోలీసులు చేసిన పనిని‌ సమర్దించుకునేందుకు వీరిపై సంఘవిద్రోహులుగా ప్రచారం చేశారు.. జరిగిన ఘటన దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు..

Read Also: Pardeep Narwal: కబడ్డీ లెజెండ్ ప‌ర్ధీప్ న‌ర్వాల్‌ సంచ‌లన నిర్ణ‌యం!

వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్‌ జగన్.. రాకేష్ పాలిటెక్నిక్ చదివాడు. వీరి కుటుంబం చదువుకున్నవారు.. పబ్లిక్ షేమింగ్ చెయ్యడం కరెక్టేనా? వీళ్లు తెనాలి వాళ్లుకాదు.. మంగళగిరి వారు.. పోలీసులు చెబుతున్నవన్నీ అబద్దాలే అని అర్థం అవుతుందన్నారు.. వీరిపై ఉన్న కేసులు పెద్దవి కాదనేగా.. కరిముల్లా అలియాస్ బాబూలాల్ పై ఎటువంటి కేసులు లేవన్నారు. రాకేష్ కు పోలీసులు కొట్టడంతో కాలికి గాయమయ్యింది. కాలిలో రాడ్డు ఉందని చెబితే అదే కాలిపై పోలీసులు కాళ్లుపెట్టి నడిరోడ్డుపై కొట్టారు.. దాచేపల్లిలో హరికృష్ణపై తప్పుడు కేసుపెట్టి సీఐ క్వార్టర్ లో పడేశారు.. తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేసి అతనిని కాపాడుకున్నారు.. రాజమండ్రిలో పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను పోలీసులు అర్దనగ్నంగా చిత్రహింసలు పెట్టారు.. మీరు పోలీసులా… రాక్షసులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Kamal Haasan: ‘‘మీరేమైనా చరిత్రకారులా..?’’ కన్నడ వ్యాఖ్యలపై కమల్ హసన్‌ని మందలించిన కోర్టు..

కృష్ణవేణి, సుధారాణిలను మహిళలు అనికూడా నెలల తరబడి పోలీస్ స్టేషన్లచుట్టూ తిప్పారు.. మొట్టమొదటిసారిగా చూస్తున్నాం… పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్యేలకోసం మామూళ్లు వసూలు చేస్తున్నారు.. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు కనిపిస్తున్నాయి.. అన్నింట్లో వాటాలు చంద్రబాబు, లోకేష్ లకు వెళ్తున్నాయి.. పోలీసులను వాడుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.. కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు.. కోర్టులు తీర్పు ఇచ్చేవరకూ చూడాలి.. పోలీసులకు శిక్షించే అధికారం ఎవరిచ్చారు? అని నిలదీశారు.. పోయిన యువకుల కుటుంబాల పరువు ఎవరు ఇస్తారని అడుగుతున్నా విక్టర్ తండ్రి మాజీ రిపోర్టర్.. మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Consoles
  • Guntur
  • Jhon Victor Family
  • tenali

తాజావార్తలు

  • Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

  • Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

  • Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..

  • LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions