YS Jagan: చంద్రబాబు గారూ.. ఒక్క దీపం అయినా వెలిగిందా?
- ఎక్స్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్
- రాష్ట్ర ప్రజల జీవితాల్లో చీకటి నింపుతున్నారు
- 18 నెలల కాలంలో ఒక్క దీపం అయినా వెలిగిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండగ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి.. చీకటి నింపుతున్నారంటూ ఎక్స్‌లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అని విమర్శించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత.. వెలగని దీపాలే కదా? అని జగన్ ఎద్దేవా చేశారు.
1. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి
2. ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000
3. 50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు.
4. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట
5. ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000
6. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు
7. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం
8. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు
Also Read
Also Read: YCP ZPTC Murder: వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్య!
ఇవన్నీ వెలగని దీపాలో.. లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా. మా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు.. ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అంటూ ఎక్స్‌లో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!