Site icon NTV Telugu

YS Jagan: వైఎస్ జగన్ రాకతో మార్మోగిన బేగంపేట..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆస్తుల కేసులో మరికొద్ది సేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా బేగంపేట విమానాశ్రయంకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జగన్ మోహన్ రెడ్డి రాకతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 11 ఛార్జ్ సీట్ల విచారణలో భాగంగా నేడు జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ వ్యక్తిగతంగా వైఎస్ జగన్ హాజరవుతున్నారు.

Eric Trump: జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయ’’ ద్వేషి.. ట్రంప్ కుమారుడి సంచలన వ్యాఖ్యలు..

ఐదేళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు హాజరవుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. చివరిసారిగా 2020 జనవరి 10న వ్యక్తిగతంగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే దారి వెంబడి వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం తెలుపుతూ.. రోడ్లపై పెద్ద ఎత్తున కేకలు వేస్తూ, బైకులతో ర్యాలీ చేస్తూ వైసీపీ శ్రేణులు వారి ఆనందాన్ని తెలిపాయి. చూడాలి మరి కోర్టు వైఎస్ జగన్ సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వనుందో.

Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..

Exit mobile version