యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచాలని నిర్ణయం తీసుకున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలో నూతన నియామకాలు జరిగాయి. పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను జగన్ చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను వైఎస్ జగన్ నియమించారు. గత ఫిబ్రవరిలో వైసీపీలో శైలజానాథ్ చేరిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి వీరాంజనేయులును వైఎస్ జగన్ బరిలో నిలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాంజనేయులుకు సీట్ ఇస్తే.. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయ పరిస్థితుల్లో శైలజానాథ్‌ను శింగనమల వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శైలజానాథ్ విజయం సాధించారు. ఇక ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు జగన్ ఆదేశాల మేరకు పరిశీలకుల నియమకం జరిగింది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు:
1) శ్రీకాకుళం – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ
2) విజయనగరం – కిల్లి సత్యనారాయణ
3) అరకు – బొడ్డేటి ప్రసాద్
4) అనకాపల్లి – శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యే
5) విశాఖపట్నం – కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే
6) కాకినాడ – సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ
7) అమలాపురం – జక్కంపూడి విజయలక్ష్మి
8) రాజమండ్రి – తిప్పల గురుమూర్తి రెడ్డి
9) నరసాపురం – ముదునూరి మురళీ కృష్ణంరాజు
10) ఏలూరు – వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ
11) మచిలీపట్నం – జెట్టి గురునాథం
12) విజయవాడ – మోదుగుల వేణుగోపాల రెడ్డి, మాజీ ఎంపీ
13) గుంటూరు – పోతిన మహేష్
14) నరసరావుపేట – పూనూరు గౌతంరెడ్డి
15) బాపట్ల – తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ
16) ఒంగోలు – బత్తుల బ్రహ్మానందరెడ్డి
17) నెల్లూరు – జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
18) తిరుపతి – మేడా రఘునాథ రెడ్డి, ఎంపీ
19) చిత్తూరు – చవ్వా రాజశేఖర రెడ్డి
20) రాజంపేట – కొత్తమద్ది సురేష్ బాబు, మేయర్
21) కడప – కొండూరు అజయ్ రెడ్డి
22) అనంతపురం – బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
23) హిందూపురం – ఆర్. రమేష్ రెడ్డి
24) నంద్యాల – కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ
25) కర్నూలు – గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
