Site icon NTV Telugu

Local Boy Nani: ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం.. అసలు విషయం బయటపెట్టిన లోకల్‌ బాయ్‌ నాని..

Local Boy Nani

Local Boy Nani

Local Boy Nani: విశాఖ ఫిషింగ్‌ హార్చర్‌లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.. ఈ ప్రమాదంలో 49 బోట్లు కాలిపోయినట్టు.. ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.. వారికి పరిహారాన్ని కూడా ఇప్పటికే అందజేసింది ఏపీ ప్రభుత్వం.. అయితే, ఈ ఘటనలో యూ ట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నానిపై ఆరోపణలు వచ్చాయి.. నానిని అదుపులోకి తీసుకొని.. మూడు రోజుల పాటు ప్రశ్నించారు పోలీసులు.. ఇదే సమయంలో.. కోర్టును ఆశ్రయించి.. బయటకు వచ్చాడు.. మరోవైపు.. తనను అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు నాని.. ఆ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన నాని.. ఏం జరిగిందనే దానిపై అసలు విషయాన్ని బయటపెట్టారు.

Read Also: Mynampally Hanumanth Rao: కల్వకుంట్ల కుటుంబం మాటల గారడీ ఇక చెల్లదు..

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు నాని.. వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను.. రాత్రి 11.45 గంటల సమయంలో నాకు బోట్లు తగల బడుతున్నట్టు ఫోన్ వచ్చింది.. దీంతో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను.. నేను వెళ్లే సమయానికి బోట్లు తగల బడుతున్నాయి అని తెలిపాడు.. నేను అప్పటికే మద్యం తాగే ఉన్నాను.. నేను హార్బర్ కు వెళ్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యిందన్నాడు.. అయితే, ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే నేను ప్రయత్నం చేశాను.. కానీ, వీడియోలు తీస్తున్న నన్ను కొందరు కొట్టే ప్రయత్నం చేశారని.. వీడియో తీసిన తర్వాత నేను కూడా సహాయక చర్యల్లో పాల్గొననా తెలిపాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు వెల్లడించాడు.

Read Also: Local Boy Nani: ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు లోకల్‌బాయ్‌ నాని..

ఇక, వీడియో పోస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని తెలిపాడు లోకల్‌ బాయ్‌ నాని.. పోలీసు విచారణ కోసం రావాలని కోరటంతో వెళ్లాను.. పోలీసులు నేను బోట్లు తగల బెట్టానని నాపై చేయి చేసుకున్నారు.. నేను ప్రమాదం జరిగే సమయంలో హోటల్ లో ఉన్నాను, ఆ హోటల్ లో సీసీ టీవీ ఫుటేజ్ లో నేను ఉన్నాను.. హోటల్‌లోకి ఎప్పుడు వెళ్లింది.. మళ్లీ ఎప్పుడు బయటకు వచ్చింది అన్నీ ఆ ఫుటేజ్‌లో ఉన్నాయని తెలిపాడు.. కానీ, పోలీసులు మూడు రోజుల పాటు నన్ను నిర్బంధించారు.. గర్భిణి అయిన నా భార్య ఎంతో ఆందోళనకు గురైంది.. ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.. అంతేకాదు.. కోర్టులో పిటిషన్ వేయక పోతే పోలీసులు నన్ను అంతం చేసే వారు అంటూ కన్నీరు మున్నీరయ్యాడు లోకల్‌ బాయ్‌ నాని..

Exit mobile version