NTV Telugu Site icon

Harsha Sai Audio Leak: హర్ష కృష్ణుడి లాంటి కళ్లు నీవి.. యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్

Harsha Sai

Harsha Sai

Harsha Sai Audio Leak: హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష సాయితో యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో యువతి హర్ష సాయితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంది. ఆ లీకైన ఆడియోలో యువతి మాట్లాడుతూ.. “హర్ష ఐ లవ్ యూ.. కాసేపు రొమాంటిక్‌గా మాట్లాడుదామా.. కొన్ని సార్లు నాకెలా అనిపిస్తదంటే.. మనిద్దరం డిబేట్‌కు అలా కూర్చోగలుగుతామా.. ప్రేమ మాటలకు అలా ఎలా కూర్చోగలుతాం అని ఫీలింగ్ వస్తుంది.. నాకు నా చెయ్యి నీ జుట్టు మీద పెట్టాలని ఉంటది.. దగ్గరకు తీసుకోవాలని ఉంటది. కౌగిలించుకోవాలని ఉంటది. హార్ట్‌బీట్ వినాలని ఉంటది. నీ శ్వాసను వినాలని ఉంటది. నువ్వు పడుకున్నప్పుడు చూడటం ఇష్టం. అంత మంచిగా పడుకుంటావు.. ప్రశాంతమైన నిద్ర.. సాఫ్ట్ బాడీ ఉంటది.. కళ్లెంత బాగుంటాయి.. అసలు నీవి కృష్ణుడి లాంటి కళ్లు తెలుసా?.. అవును నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు. చాలా చాలా చాలా.. అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది. స్కిన్‌ ఇంకా సాఫ్ట్‌గా ఉంటది. నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటది. నో సిగరెట్, నో మందు.. నో ఎక్స్‌ట్రా తప్పు అలవాట్లు.. నో ఫాల్తూ గాసిప్‌లు.. ఇలా ఆలోచిస్తే లక్ష మంచి క్వాలిటీస్‌ ఉన్నాయని” అంటూ యువతి రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో లీక్‌ అయింది. రొమాంటిక్ ఆడియో బయటపడడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని మాట్లాడిన యువతి రేప్ కేసు ఎందుకు పెట్టినట్లు అనే సందేహాలు కలుగుతున్నాయి. కేసు వెనుక వేరే కారణం ఏదైనా ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Read Also: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)

తెలుగులో స్టార్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను పెళ్లి పేరుతో నమ్మించి రెండు కోట్ల రూపాయల మేర మోసం చేశాడంటూ గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కనిపించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి తాను స్పృహ తప్పాక తన న్యూడ్ వీడియోలు తీసుకుని వాటిని చూపించి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది. అయితే దీని మీద హర్ష సాయి స్పందిస్తూ తన మీద వచ్చిన ఆరోపణలు ఏవి నిజం కాదని, డబ్బు కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. తన న్యాయవాది ఈ విషయం మీద స్పందిస్తాడని ఆయన పేర్కొన్నారు. సదరు న్యాయవాది కూడా స్పందిస్తూ హర్ష సాయి తప్పేమీ లేదని ఇప్పుడు ఈ కేసు వల్ల ఆయన పరువు పోయిందంటూ కామెంట్ చేశారు. ఇదంతా ఇలా సాగుతున్న సమయంలో ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఇందులో హర్ష సాయి మీద కేసు పెట్టిన అమ్మాయి రొమాంటిక్‌గా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రొమాంటిక్ ఆడియో మీరు కూడా వినండి.

 

Show comments