హైదరాబాద్ నగరంలో న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్‌కు ఓ రౌడీ షీటర్ కత్తితో రక్తపు గాయం చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. వట్టెపల్లికి చెందిన బాధితుడు ముబీన్ మీర్జా, మహమూదా హోటల్ సమీపంలో నిలబడి ఉండగా, రౌడీ షీటర్ సోహైల్ , అతని సహచరులు వచ్చి అకస్మాత్తుగా బాధితుడి ముఖంపై కత్తితో దాడి చేశారు. క్షతగాత్రుడిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదైంది. ముబీన్ మీర్జా గత నెల రోజులుగా నగరంలో , ఇతర చోట్ల మతపరమైన స్థలాలను కూల్చివేయడానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తారు.
Tollywood : రెండు రోజుల ముందుగానే స్పెషల్ షోలు.. ఏ సినిమా అంటే..?
సోహెల్ , అతని అనుచరుల అరాచకాలను యూట్యూబ్ ఛానల్ లో టెలిక్యాస్ట్ చేసి నందుకు రిపోర్టర్ పై సోహెల్ గ్యాంగ్ పగబట్టింది. యూట్యూబ్ నుంచి తమకు సంబంధించిన లింక్ తీసేయకపోతే…చంపుతానని బెదిరించారు. కానీ వార్తకు సంబంధించిన లింక్ తొలగించలేదు మూబిన్. దీంతో మూబీన్ పై కత్తులతో దాడి చేశారు. రౌడీ షీటర్ సోహెల్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు బాధితుడు రిపోర్టర్ ముబిన్. అతనికి జర్నలిస్టు సంఘాలు మద్దతు పలికాయి. దాడి ఘటనపై బాధితుడు ముబిన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు.
US arrests Pakistani: డొనాల్డ్ ట్రంప్ సహా మరికొందరి హత్యకు ప్లాన్ చేసిన పాకిస్థానీ..