Site icon NTV Telugu

Youtube : ఇకనుంచి యూట్యూబ్ లో ఆ ఆప్షన్ కనిపించదు

Youtube

Youtube

Youtube : వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను ఆపేయనుంది. యూట్యూబ్ 2017లో స్టోరీస్ ఫీచర్‌ను పరిచయం చేసింది. యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈజీ అప్‌డేట్‌ షేరింగ్, సంభాషణల ప్రారంభం, కంటెంట్‌ ప్రచారం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లను ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తోంది. ఇందుకు యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు బెస్ట్ అని అనుకుంటోంది. ఎందుకంటే స్టోరీస్ ఫీచర్ తో పోలిస్తే యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు.. ఎక్కువ వ్యూయర్ షిప్ తో పాటు.. కామెంట్‌లు, లైక్‌లు వస్తాయి. ఇవి యూజర్లకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి.

Read Also:Crime News: వృద్ధుణ్ని చంపి.. ముక్కలు చేసి అటవీలో పడేసిన యువజంట

“6/26/2023 నుంచి కొత్త YouTube స్టోరీని సృష్టించే ఎంపిక అందుబాటులో ఉండదు. ఆ తేదీలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేయబడిన కథనాలు పోస్ట్ చేసిన ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయి” అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ స్టోరీస్ ఫీచర్ ను సోషల్ మీడియా దిగ్గజాలైన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ప్రవేశపెట్టారు. కానీ ఈ ఫీచర్ సక్సెస్ కాలేదు. ప్రవేశపెట్టిన మొదట్లో ఆదరణ భాగానే లభించినా క్రమంగా యూజర్లు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది పొడవునా కొత్త ఫీచర్‌లతో షార్ట్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లను మెరుగుపరచడం కొనసాగిస్తామని యూట్యూబ్ చెబుతోంది.

Read Also:Yoga Mahotsav: రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలి.. యోగా మహోత్సవ్ లో గవర్నర్..

Exit mobile version