NTV Telugu Site icon

Viral Video: ఢిల్లీ మెట్రోలో మరోసారి రెచ్చిపోయిన యువతులు.. చూసేవారికి భలే టైమ్ పాస్

Woman

Woman

ఢిల్లీ మెట్రోలో ఫైటింగ్ సీన్స్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మెట్రోలో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాలు, బికినీలతో ప్రయాణాలు, వింత డ్యాన్స్‌లు వంటివి చేస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురి చేస్తుంటారు. తాజాగా.. ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ, తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. అయితే.. మెట్రోలో ప్రయాణిస్తున్న జనాలు జోక్యం చేసుకోకుండా.. వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా సైలెంట్‌గా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు.

Mahindra Thar 5-Door: బురదలో ఇరుక్కున్న మహీంద్రా థార్ 5- డోర్.. వీడియో వైరల్..

విషయానికొస్తే.. సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగినట్లు వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో విషయం కొట్లాటకు దారితీసింది. ఈ వీడియోలో.. మెట్రో డోర్ దగ్గర నిలబడి ఉన్న మహిళ సీటులో కూర్చున్న మరో మహిళతో తాను పిలవాలనుకునే వ్యక్తిని పిలవమని చెబుతోంది, ఇలా చెబుతూ ఆ మహిళను నెట్టింది. ఆ తర్వాత అవతలి మహిళ డోర్ వద్ద నిలబడి ఉన్న మహిళపై భుజంపై కొట్టింది. దాంతో ఆ మహిళ చెంపపై కొట్టింది. దీంతో.. నువ్వు నాపై చేయి ఎత్తావు, ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్తావు అని చెబుతుంది. ఇలా చెప్పగానే మొదటగా కొట్టిన మహిళ మళ్ళీ ఆ మహిళను కొట్టింది. ఆ తర్వాత రెండో మహిళ కాళ్లకు అడ్డుపెట్టి మొదటి మహిళ కిందపడేలా చేసేందుకు ప్రయత్నించింది.

Bramayugam : భారీ ధరకు సేల్ అయిన మమ్ముట్టి భ్రమయుగం ఓటీటీ రైట్స్..

అంతటితో ఆగకుండా.. మొదటి మహిళ రెండో మహిళను కొట్టేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా.. “నేనెవరో నీకు తెలియదు, నేను గాయకురాలిని.. నువ్వు నన్ను కొడతావా అంటూ.. మొదటి మహిళ తన ఫోన్‌లో నంబర్‌ను డయల్ చేసింది. త్వరలో ఈ మహిళను అరెస్టు చేయమని బెదిరించింది. ఇలా ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.