Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అన్న కొట్టాడని అలిగి స్వగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చిన యువతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఇస్ క్రీం ఇచ్చి ఆమెను వారిపై నమ్మకం వచ్చేట్లు నమ్మించారు. తీరా తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Read also: Bhatti Vikramarka: విప్లవానికి నాంది పలికిన ఆయనే నాకు స్పూర్తి.. తాజ్ కృష్ణలో భట్టి..!
సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి గ్రామంలో నివసిస్తోంది. ఈ నెల 6వ తేదీన యువతి తన అన్నతో ఏదో విషయమై గొడవ పడింది. దీంతో కోపోద్రిక్తుడైన అన్నా యువతిపై చేయి చేసుకున్నాడు. తీవ్రంగా మనస్తాపానికి గురైన యువతి ఇంటినుంచి బయలు దేరి బస్టాండ్ లో హైదరాబాద్ బస్సు ఎక్కింది. శనివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి దిగి అఫ్జల్‌గంజ్ వైపు నడుచుకుంటూ వెల్తుండగా.. ఒంటరిగా వస్తున్న యువతిని చూసి ములకపెంట శ్రీకాంత్, పానగంటి కాశీవిశ్వనాథ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెంబడించి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. సమీపంలోని ఏదైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని యువతి చెప్పింది. అక్కడికి వెళ్తున్నామని చెప్పి బైక్ ఎక్కించమన్నారు. ఆటోలో వస్తానని యువతి చెప్పినా.. మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకెళ్లారు. అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో ఐస్‌క్రీం తినిపించి తనకి వారిపై నమ్మకం కలిగించారు. అనంతరం బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లేక్‌వ్యూ హిల్స్ సమీపంలోని శ్రీకాంత్‌కు చెందిన స్క్రాప్ గోడౌన్‌కు తీసుకెళ్లారు.
Read also: ONGC Oil Production : కేజీ బేసిన్ లో చమురు ఉత్పత్తిని ప్రారంభించిన ఓఎన్జీసీ
తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని యువతి నిరాకరించడంతో ఆమెను కొట్టి, ఆపై అత్యాచారం చేశారు. మరోచోటికి వెళ్లేందుకు బైక్‌పై తీసుకెళ్తుండగా.. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితులు ఆమెను అక్కడే వదిలి పారిపోయారు. బాధితురాలు స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణం జరిగిన స్క్రాప్ గోడౌన్‌ను పరిశీలించిన పోలీసులు బండ్లగూడ గౌస్‌నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో నివసిస్తున్న ములకలపెంట శ్రీకాంత్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. తాను అత్యాచారం చేయలేదని శ్రీకాంత్ మొదట పేర్కొన్నాడు. అనంతరం నేరం అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు పానగంటి కాశీవిశ్వనాథ్‌ను కూడా అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారని తేలింది.
Bhatti Vikramarka: విప్లవానికి నాంది పలికిన ఆయనే నాకు స్పూర్తి.. తాజ్ కృష్ణలో భట్టి..!