Site icon NTV Telugu

Hardoi Petrol Pump: కాల్చి పడేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగిపై రివాల్వర్ గురి పెట్టిన యువతి.. చివరకు

Hardoy

Hardoy

పెట్రోల్ పంపులలో పనిచేస్తున్న సిబ్బంది తరచుగా బెదిరింపులకు గురవుతున్నారు. కొందరు వాహనదారులు చిన్న చిన్న కారణాలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రివాల్వర్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read:Sonia Gandhi: నిలకడగా సోనియాగాంధీ ఆరోగ్యం.. వైద్యుల వెల్లడి

కారులో సీఎన్‌జీ నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులను కిందకు దిగమని కోరడంతో ఈ వివాదం జరిగింది. వాగ్వాదం తర్వాత, ఆ అమ్మాయి సేల్స్‌మ్యాన్ ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి బెదిరించింది. షాబాద్ ప్రాంతానికి చెందిన ఎహ్సాన్ ఖాన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిల్‌గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండి రోడ్‌లోని పెట్రోల్ పంప్‌కు తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా, భార్య హుస్న్‌బానోతో కలిసి కారులో వచ్చారు. వారు ఈ పెట్రోల్ పంప్‌కు సిఎన్‌జి నింపుకోవడానికి వచ్చారు. సిఎన్‌జి నింపుతుండగా, ఉద్యోగి రజనీష్ కుమార్ వారిని కారు నుంచి దిగమని కోరాడు. ప్రమాదాలు చెప్పి జరగవు కదా సీఎన్జీ ఫిల్ చేసేటపుడు కారు దిగమని కోరాడు. వారు దిగకపోవడంతో కారులో సిఎన్‌జి నింపడానికి నిరాకరించాడు.

Also Read:Yogandhra 2025: ప్రధాన వేదిక ఆర్కే బీచ్.. మార్పు చేయాల్సి వస్తే?

దీంతో కారులో ఉన్న ఎహ్సాన్ ఖాన్ అతనితో వాగ్వాదానికి దిగి, అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా ఎహ్సాన్ కుమార్తె అరిబా కారు నుంచి రివాల్వర్‌ను తెచ్చి అతని ఛాతీపై గురిపెట్టింది. అరిబా పంప్ ఉద్యోగిని చంపేస్తానని బెదిరించింది. పెట్రోల్ పంప్ వద్ద ఉన్న వ్యక్తులు కలుగజేసుకుని యువతిని శాంతింపజేశారు. అరిబా పంప్ ఉద్యోగిపై రివాల్వర్ గురిపెట్టిన సంఘటన సీసీటీవీలో రికార్డైంది. ఇప్పుడు, ఈ కేసులో, పంప్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎహ్సాన్ ఖాన్, అతని కుమార్తె, భార్యపై కేసు నమోదు చేశారు. రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చట్టం వంటి సెక్షన్ల కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Exit mobile version