NTV Telugu Site icon

Mexico: రైలుతో సెల్ఫీ తీసుకోవాలని అత్యుత్సాహం.. ప్రాణాలు విడిచిన మహిళ..!

Selfi

Selfi

Mexico: సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ప్రమాదకరమైన రీతిలో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. గతంలో రిజర్వాయర్స్, వాటర్ ఫాల్స్, రన్నింగ్ ట్రైన్ల దగ్గర సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటివి చూసిన కూడా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. తాజాగా ఓ యువతి సెల్ఫీ తీసుకునే మోజులో పడి తన ప్రాణాలను కోల్పోయింది. అందరు చూస్తుండగానే రైలు ఢీ కొన్ని మరణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also: Dating Scam With Girls: నగరంలో కొత్తరకం మోసం.. అమ్మాయిలతో మోష్‌ పబ్‌ డేటింగ్ స్కామ్

ఈ ఘటన మెక్సికోలోని హిడాల్గోలోని ఫేమస్ అయిన ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు వస్తున్న సమయంలో దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేసిన ఓ యువతిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. రైలు ప్రమాదంలో మరణించిన మహిళ తన కుమారుడు చదువుకునే స్కూల్ సమీపంలో ఈ రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ పై 1930లో నిర్మించిన ‘ఎంప్రెస్’ అని పిలిచే స్టీమ్ రైలు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఈ ట్రైన్ ప్రయాణిస్తున్న ప్రాంతంలో ప్రజలు గుమిగూడి ఆ రైలుతో ఫోటోలు, సెల్పీలు, వీడియోలు తీసుకుంటున్నారు.

Read Also: Houthi Rebels: మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. యూఏఈకి వెళ్తున్న ఓడ సమీపంలో పేలుడు

ఈ క్రమంలోనే హిడాల్గో సమీపం దగ్గర ఈ స్టీమ్ రైలును చూసేందుకు తన కుమారుడితో పాటు వచ్చిన సదరు మహిళ మృతి చెందింది. అయితే అత్యుత్సాహంతో ఆమె ట్రాక్ కు దగ్గరగా నిలబడి ట్రైన్ తో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నం చేసింది. వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన ఆ రైలు ఆమెను ఢీకొట్టింది. మహిళ తల భాగాన్ని బలంగా రైలు ఢీ కొట్టడంతో రెప్పపాటులో ఆమె కుప్పకూలి పోయింది. దీంతో అప్పటి వరకు సంతోషంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.