వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కులత. మైనర్ లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్. దీనిలో భాగంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి. ఆ తర్వాత తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు చేసిన ముఠా.
Also Read:Malavika Mohanan : అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..
ఆపై నర్సంపేట తీసుకెళ్ళి అత్యాచారం చేసిన ముఠా. ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మార్చి 11న వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మైనర్ బాలిక మిస్సింగ్ ఫిర్యాదు రాగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ముఠా ఆటకట్టించి కటకటాలపాలు చేశారు.