KaruppuAudioLaunch : ఏకంగా 73 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న యంగ్ సెన్సేషన్

Sai Abhyankar

Sai Abhyankar

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పు. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడుగా రిలీజ్ అవుతోంది. గత రాత్రి చెన్నైలో కరుపుఆడియో రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ సినిమా దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న యువ సంచలనం సాయి అభ్యంకర్ గురించి ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. “మేము సాయిని ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించినప్పుడు అతనునికి ఇది తన మొదటి సినిమాగా సంతకం చేశాడు. కానీ ఈ రోజు అతను ఏకంగా 73 సినిమాలకు సంతకం చేసే స్థాయికి ఎదిగాడు. సాయి టాలెంట్ ను గుర్తించి ప్రతి ఒక్కరు అవకాశం ఇస్తున్నారు. ఇటీవల నేను అతని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హెలికాప్టర్ కూడా ఉంచడం చూసి ఆశ్చర్యపోయాను. అతను నిజంగా ఒక అద్భుతమైన ప్రతిభ గల సంగీత దర్శకుడు”  సాయి అభ్యంకర్‌ను ‘కరుపు’ చిత్రంలోకి తీసుకోవడం తమకు దక్కిన అతిపెద్ద విజయం. సాయి మా సినిమాకు ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి వాడు. అతని పాటలు విడుదలైనప్పుడు కొందరు విమర్శించవచ్చు లేదా తిట్టుకోవచ్చు కానీ కేవలం 15 నిమిషాల్లోనే ఆ పాటలు సృష్టించే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ ప్రభావం వల్లే ప్రేక్షకులు ఆ పాటలకు అంతగా కనెక్ట్ అవుతారు” అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ‘కరుపు’ ఆడియో లాంచ్‌లో సాయి అభ్యంకర్ గురించి ఆర్జే బాలాజీ చేసిన ఈ ‘హెలికాప్టర్’ కామెంట్స్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి.