NTV Telugu Site icon

Tamanna : నేను పెళ్లికి రెడీ.. తమన్నాకు ఫోటోగ్రాఫర్ ఆహ్వానం.. ఆమె ఏం చేసిందంటే ?

New Project (64)

New Project (64)

Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు అవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసిన తమన్నా ప్రస్తుతం హిందీ భాషలో సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ఓ వైపు విజ‌య్ వ‌ర్మతో ప్రేమాయ‌ణం గురించి ముంబై మీడియా ఎక్కువ‌గా ప్రచారం చేస్తుంది. మ‌రోవైపు త‌మ‌న్నా బిజీ షెడ్యూళ్లను మ్యానేజ్ చేస్తూ దేశంలోని పలు నగరాలకు ప్రయాణిస్తోంది. తన కెరీర్‌పై ఫోక‌స్ చేస్తూనే, వ్యక్తిగ‌త జీవితంలో ల‌వ్ లైఫ్ పైనా దృష్టి సారించింది త‌మ‌న్నా. ఇటీవ‌ల కాలంలో దాదాపు సౌత్ కి దూర‌మైనా కానీ, బాలీవుడ్ లో మాత్రం వెబ్ సిరీస్‌లు, సినిమాల‌తో బిజీ అవుతోంది.

Read Also:Shivaratri Brahmotsavam 2025: శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్‌

ఇంత‌కుముందు త‌న ప్రియుడు విజ‌య్ వర్మతో క‌లిసి కొన్ని వెబ్ సిరీస్ ల‌లో నటించింది. 2024లో స్త్రీ 2 లాంటి బ్లాక్ బ‌స్టర్ లో స్పెషల్ సాంగులో మ‌రోసారి ఫ్యాన్స్ ని అల‌రించింది. మ‌రోవైపు త‌మ‌న్నా ఒకేసారి మూడు సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉంది. తను నెక్ట్స్ ‘వేద’ అనే చిత్రంలో న‌టిస్తోంది. నీర‌జ్ పాండే సిరీస్ ‘సికంద‌ర్ కా ముఖ‌ద్ద‌ర్’ లోను ప్రధాన పాత్రలో న‌టిస్తోంది. చాలాగ్యాప్ తర్వాత తెలుగులో ‘ఓదెలా 2’ సినిమాకు ఓకే చెప్పింది ప్రస్తుతం అది చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ నిరంత‌రం బిజీగా ఉన్న త‌మ‌న్నా ఇటీవ‌ల ఎయిర్ పోర్టు నుంచి వెళుతుంటే త‌న‌ను క‌లిసిన ఓ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ పెళ్లికి ఆహ్వానించాడు. త‌న‌కు పెళ్లి కుదిరింద‌ని ఆ యంగ్ ఫోటోగ్రాఫ‌ర్ ఎంతో ఉత్సాహంగా త‌మ‌న్నాతో చెప్పడంతో ఆమె విషెష్ తెలిపింది. అతడి పెళ్లికి వస్తాన‌ని మాటిచ్చింది. మరి విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా పెళ్లి ఎప్పుడు? అన్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్ గా మారింది.

Read Also:Sachin Tendulkar: బౌలింగ్‌తో సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి (వీడియో)

Show comments