Site icon NTV Telugu

Hyderabad: మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు.. కారుతో ర్యాష్ డ్రైవింగ్.. ఐదుగురికి తీవ్రగాయాలు

Car

Car

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు మారడం లేదు. వనస్థలిపురం గుర్రంగూడ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది థార్ కారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. థార్ కారు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read:Yellamma : ‘ఎల్లమ్మ’ నుండి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్

మద్యం మత్తులో ఉండటమే కాకుండా మితిమీరిన వేగంతో కారు నడిపాడు యువకుడు. కారు అదుపు తప్పి ముందు బైక్ పై వెళ్తున్న సిరిసిల్లకు చెందిన ఇద్దరు యువకులను ఢీ కొట్టింది. బైక్ పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా మారింది. థార్ కారు డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి మూడు పల్టీలు కొట్టి పడిపోయింది. కారు నడుపుతున్న యువకుడు, కారులో ఉన్న మరో యువకుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో కారులో ఉన్న దినేష్, శివ కి గాయాలయ్యాయి. గాయపడ్డ యువకులు హస్తినాపురంలోని రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version