Site icon NTV Telugu

తహసీల్దార్‌కు యువకుల వెరైటీ లెటర్.. వధువును వెతికిపెట్టాలని వినతి

దేశంలో అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా వధువు దొరకడం లేదు. దీంతో దేశంలో రాష్ట్రంతో సంబంధం లేకుండా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొందరు యువకులు తహీసీల్దార్‌కు వెరైటీగా లెటర్ రాశారు. తాము పెళ్లి చేసుకోవాలంటే యువతులు దొరకడం లేదని.. తమకు వధువును వెతికిపెట్టాలని సదరు లెటర్ ద్వారా కోరారు. ఈ ఘటన తమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా లక్కగొండవహళ్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో జనస్పందన కార్యక్రమాన్ని తహసీల్దార్ నిర్వహించగా కొందరు యువకులు ఈ వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు సమర్పించారు.

Read Also: ఉల్లిగడ్డతో కొత్త వ్యాధి..వణికిపోతున్న ప్రజలు

సాధారణంగా ఈ రోజుల్లో యువకులకు జాబ్ ఉంటే తప్ప ఎవ్వరూ పిల్లను ఇచ్చి పెళ్లి చేయడం లేదు. దీంతో లక్కగొండవహళ్లి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న యువకులకు పిల్లను ఇవ్వడానికి యువతుల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. దీంతో చాలా మంది యువకులు దూరప్రాంతాలకు చెందిన యువతులను పెళ్లి చేసుకుంటున్నారు. అయితే సదరు గ్రామంలో కొందరు యువకులకు వయసు మళ్లుతున్నా పెళ్లిళ్లు కాలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు చెందిన పలువురు యువకులు ఇలా స్పందన కార్యక్రమంలో తహసీల్దార్‌కు వధువును వెతికిపెట్టాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారన్నమాట.

Exit mobile version