మహిళల పట్ల ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అసభ్యంగా ప్రవర్తిస్తూ రెచ్చిపోతున్నారు కొందరు వ్యక్తులు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి ముందు ఓ వ్యక్తి ప్యాంట్ జిప్ తీసి పశువులు కూడా సిగ్గుపడేలా ప్రవర్తించాడు. అది కూడా పట్టపగలు, జనాలు సంచరిస్తున్న ప్రదేశంలో నీచంగా ప్రవర్తించాడు. బాధిత యువతి తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వీడియో తీసింది. అసభ్యంగా ప్రవర్తిస్తూ మాస్టర్బేషన్ చేస్తున్న వీడియోను ఆమె స్వయంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాన్ని తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ ఆ ఘోరాన్ని వివరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Ghati-Mirai-The Girlfriend : అనుష్క, తేజసజ్జ మధ్య భీకర పోటీ.. రష్మిక నిలబడుతుందా..?
గురుగావ్‌కు చెందిన ఓ మోడల్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ కోసం రాజీవ్ చౌక్‌లో ఎదురు చూస్తూ ఉంది. ఈ క్రమంలో ఆ యువతికి కొంత దూరంలో నిల్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అందరు చూస్తుండగానే ప్యాంట్ జిప్ తీసి ఆమెకు ఎదురుగా అటు, ఇటు తిరగడం మొదలు పెట్టాడు. ఈ హఠాత్పరిణామంతో ఆమోడల్ భయాందోళనకు గురైంది. అతడి ప్రవర్తనతో విసిగిపోయి ఈ తతాంగాన్నంత వీడియో తీసింది.
Also Read:Trump Tariffs: ట్రంప్ సుంకాల మోతకు “ఆపరేషన్ సిందూర్” కారణమా..? సంచలన విషయాలు..!
దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ సంఘటన నన్ను భయపెట్టింది కానీ మౌనం వహించకూడదని భావించాను. అందుకే వీడియో తీసి ప్రజల దృష్టికి తీసుకువచ్చాను. ఇలాంటి మనుషులు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడానికి వీల్లేదు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. “ఇలాంటి అసభ్య ప్రవర్తన నేరంగా పరిగణించబడుతుంది. మహిళ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటాము,” అని గురుగ్రామ్ పోలీసులు పేర్కొన్నారు.
