Site icon NTV Telugu

Secunderabad Railway Station: హనీమూన్ కి బయలుదేరిన యువకుడు.. వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి.. చివరకు

Sai

Sai

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. హనీ మూన్ కి బయలుదేరిన యువకుడు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి రైల్ కు ప్లాట్ ఫారంకు మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వరంగల్ కు చెందిన ఉరకొండ సాయి (28) గా పోలీసులు గుర్తించారు. సాయికి మూడు నెలల క్రితం వివాహం జరిగినట్లు తెలిపారు.

Also Read:Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్‌..? డబుల్‌ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..

హనీమూన్ కు గోవాకు వెళ్ళడం కోసం తన భార్య, బావమరిది, 4స్నేహితులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వస్కోడిగామ ఎక్స్ ప్రెస్ రైల్ ఎక్కారు. రైలు కదలడంలో ఆలస్యం అవుతుండడంతో వాటర్ బాటిల్ కోసం సాయి కిందకు దిగాడు. సాయి తిరిగి వచ్చే లోపు ట్రైన్ కదలడంతో అందులో ఉన్న అతడి స్నేహితులు చైన్ లాగి రైలును ఆపారు. చైన్ లాగిన ఇద్దరు యువకులను కిందకు దింపి ప్రశ్నించిన రైల్వే పోలీసులు జరిమానా కట్టాలన్నారు.

Also Read:Bajaj 125cc Bike: బజాజ్ కొత్త 125cc బైక్‌.. విడుదలయ్యేది అప్పుడే!

జరిమానా కడతామని, తమను వదిలి పెట్టాలని స్నేహితులతో పాటు సాయి పోలీసులను ప్రాధేయ పడ్డాడు. ఈ లోపు రైలు కదలడం అందులోనే తన భార్య, బావమరిది ఉండడంతో పరిగెత్తి సాయి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అదుపుతప్పి కిందపడి రైల్ కు, ప్లాట్ ఫారం కు మద్యలో ఇరుక్కొని తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. సాయి మృతికి రైల్వే పోలీసులే కారణమని స్నేహితులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తగిన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version