Site icon NTV Telugu

Alwal: జిమ్ లో పరిచయం.. యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి బెదిరిస్తున్న నిత్య పెళ్లి కొడుకు

Alwal

Alwal

అల్వాల్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. యువతి కార్ లో ట్రాకింగ్ డివైస్ పెట్టీ బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్య పెళ్లి కొడుకు. స్థానిక నేత పై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని బాధితురాలి పై ఒత్తిడి చేస్తున్నాడు. జిమ్ లో పరిచయం అయిన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు నిత్య పెళ్లి కొడుకు రవి అలియాస్ రఫీ, అతడి సోదరుడు రూపేష్. బాధితురాలి ఆడియోలు మార్ఫిఫింగ్ చేసి యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు నిందితులు.

Also Read:Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!

10 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు యువతి తెలిపింది. ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే, సాయి ప్రసాద్ అనే స్థానిక నేత పై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపింది. వారి వేధింపులు తాళలేక రూపేష్, రఫీ పై అల్వాల్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కొద్దిరోజుల క్రితమే రఫీ పై నిత్య పెళ్లి కొడుకు ఆరోపణలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version