NTV Telugu Site icon

Shocking Incident: బైక్ కొనివ్వలేదని తాళాలు మింగిన యువకుడు.. చివరకు..

Narasaraopet

Narasaraopet

Shocking Incident: చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్నపాటి విషయాలకు మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఇనుప తాళాలు మింగిన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగింది. తనకు బైక్ కావాలని ఇంట్లో వాళ్లతో గొడవపడి నాలుగు తాళాలను మింగేశాడు. తాళాలు మింగిన యువకుడు భవాని ప్రసాద్‌కు తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాప్రోస్కోపీ విధానంతో ఎలాంటి సర్జరీ లేకుండా కడుపులో ఉన్న నాలుగు తాలాలను అత్యంత చాకచక్యంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Read Also: Ola Showroom: వింత ఘటన.. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ షోరూంకు తాళం వేసిన కస్టమర్

Show comments