Site icon NTV Telugu

Online Betting: తండ్రి పంపిన రూ. 40 వేలు, ఫ్రెండ్స్ వద్ద మరో రూ. 30 వేలు అప్పు చేసి బెట్టింగ్.. చివరకు

Student

Student

నర్సాపూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో బుధవారం సాయంత్రం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బివిఆర్‌ఐటి ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆన్ లైన్ లో బెట్టింగ్ లు వేసి నష్టపోయి ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్నాడు తరుణ్(20). కాలేజీ ఫీజుల కోసం 40 వేల రూపాయలు పంపిన తండ్రి మీట్యా.. ఫ్రెండ్స్ వద్ద మరో 30 వేల రూపాయలు అప్పు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టాడు తరుణ్. 70 వేల రూపాయలు నష్టపోవడంతో ఇంట్లో చెప్పలేక, ఫ్రెండ్స్ అప్పు తీర్చలేక మనస్తాపంతో హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరుణ్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు గ్రామ పరిధిలోని సూర్య తండాగా గుర్తించారు. కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.

Exit mobile version