Site icon NTV Telugu

Banjara Hills: పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. యువకుడి కిడ్నాప్

Pub

Pub

బంజారా హిల్స్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. ఓ యువకుడిని కిడ్నాప్ చేసింది ఓ మహిళ. భర్తతో కలిసి కిడ్నాప్ కు పాల్పడింది. మద్యం మత్తులో ఉన్న యువకుడి నగ్న వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. ఆభరణాల షాపు ఉద్యోగిపై భారీ స్కెచ్ వేశారు దంపతులు. యువకుడు హత్యకు గురయ్యాడంటూ టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో సినీ ఫక్కీలో డ్రామాకు తెరలేపారు. బాధితుడు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బార్ డ్యాన్సర్, ఆమె భర్తతో సహా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Exit mobile version