Site icon NTV Telugu

Khammam: వైన్ షాపులో విషాదం.. మద్యం తాగుతూ యువకుడు మృతి

Khammam

Khammam

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు వైన్ షాపులో విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు ఆంధ్రా లోని ఎన్టీఆర్ జిల్లా ఇనగడప చెందిన వేల్పుల గోపి(28)గా గుర్తించారు. వేంసూరు మండలం లింగపాలెం లోని అత్తింటికి వచ్చిన మృతుడు వేల్పుల గోపి. మృతుని బంధువులు యువకుడి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సీసీ టీవీపుటేజ్ పరిశీలిస్తున్న అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version