NTV Telugu Site icon

Extramarital Affair : సఫ్దర్ జంగ్ ఆస్పత్రి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

Murder1

Murder1

Extramarital Affair : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్య, ఆమె ప్రియుడిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబరు 30న సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి రెండో గేటు ఎదుట తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న యువతి, యువకుడి స్థానికులు గుర్తించారు. మహిళ ముఖంపై పెద్ద గాయాన్ని గుర్తించిన వారు ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. కానీ వారిద్దరు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వార్త సంచలనం సృష్టించింది. హత్యకు పాల్పడిన నిందితులకోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.

Read Also:Massive Protest: ఇండియా గేట్ వద్ద జైనుల భారీ ప్రదర్శన.. జార్ఖండ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఆ యువతికి సన్నీ గంధర్వతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఇద్దరూ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పనిచేశారు. ఇంతలో, యువతి తన భర్త చిన్ననాటి స్నేహితుడైన సాగర్‌తో సంబంధాన్ని ప్రారంభించింది. ఈ సంబంధాన్ని గుర్తించిన యువకుడు పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. ఇవేమీ పట్టించుకోకపోవడంతో యువకుడు ఇద్దరినీ కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ఆరు గంటల్లోనే డబుల్ మర్డర్‌గా తేలిందని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

Show comments