Site icon NTV Telugu

Tollywood Sequel Movies: సీక్వెల్స్తో జోరు మీదున్న యంగ్ హీరోలు

Tollywood

Tollywood

Tollywood Sequel Movies: స్టార్ హీరోల భారీ చిత్రాల సీక్వెల్స్‌ మాత్రమే కాకుండా మరోవైపు కేవలం కంటెంట్‌తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, ప్రేక్షకులను మెప్పించిన చిన్న చిత్రాల సీక్వెల్స్ కోసం కూడా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా సీక్వెల్స్ శరవేగంగా షూటింగ్‌ను కూడా మొదలు పెడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరికొన్ని క్రేజీ చిన్న సినిమా సీక్వెల్స్ వివరాలు ఒకసారి చూసేద్దాం.

నిజానికి, చిన్న హీరోలు సైతం ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. అంతేకాదు,కొన్ని సూపర్ హిట్ సినిమాలకు కొత్త హీరోలను పరిచయం చేస్తూ సీక్వెల్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే.. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన హిలేరియస్ ఫన్ ఎంటర్‌టైనర్ ‘లిటిల్ హార్ట్స్’ సీక్వెల్ తాజాగా ప్రకటించబడింది. అయితే ఈసారి హీరోగా మౌళి కాకుండా, ఏకంగా దర్శకుడే హీరోగా మారబోతున్నాడు. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సాయి మార్తాండ్ ఈ సీక్వెల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

Safe Ride Challenge: హెల్మెట్, సీట్‌బెల్ట్, సేఫ్టీ.. స్టాలిన్ సినిమా తరహా ‘సేఫ్ రైడ్ ఛాలెంజ్’

ఈ లిస్ట్ లో మరో సినిమా చూసినట్లయితే.. కామెడీతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా సమయంలోనే ‘మ్యాడ్ క్యూబ్’ను కూడా టీమ్ అనౌన్స్ చేసింది. నితిన్, సంగీత్ శోభన్, విష్ణు పలువురు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ ‘మ్యాడ్’ సిరీస్‌లో మూడో సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైనట్టు విష్ణు వెల్లడించారు. దీంతో ఈసారి వినోదం ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.

ఇక తాజాగా ‘మిరాయి’ సినిమాతో భారీ సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జ.. మరో క్రేజీ సీక్వెల్‌ను రివీల్ చేశారు. హీరోగా తనకి మొదటి బ్లాక్‌బస్టర్ అందించిన ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ చేస్తున్నట్లు పోస్టర్‌తో తేజ స్పష్టం చేశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జాంబీ రెడ్డి’ తేజకు హీరోగా మంచి విజయాన్ని అందించింది. అయితే ఈసారి దేశీయ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్ ఉంటుందని తేజ చెప్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. దీనితోపాటు తేజ సజ్జ చేస్తున్న మరో సీక్వెల్ ‘హనుమాన్’కు సంబంధించినది. పెద్ద హీరోలకు పోటీగా గత సంక్రాంతికి విడుదలై, కేవలం 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మించగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చిపెట్టిన ‘హనుమాన్’ సీక్వెల్‌ను టీమ్ మరింత వేగవంతం చేసింది. ‘జై హనుమాన్’ టైటిల్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి జాయిన్ కావడంతో జనాల్లో అంచనాలు మరింత పెరిగాయి.

Cyber Fraud: ఏఐ టెక్నాలజీతో భారీ మోసం.. సీఎం చంద్రబాబు పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు!

Exit mobile version