NTV Telugu Site icon

Sushila Meena: కేంద్ర మంత్రిని క్లీన్ బౌల్డ్ చేసిన లేడీ జహీర్ ఖాన్.. వీడియో వైరల్.

Bowling

Bowling

Sushila Meena: టీమిండియా బౌలర్లు లో ఒక్కరైనా జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ చేసే యువ క్రికెటర్ సుశీలా మీనా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి నోటా మారుమోగుతోంది. ఈమె టాలెంట్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని, దేశవ్యాప్తంగా సుశీలా గురించి చర్చ మొదలైంది. సుశీలా మీనా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పేద కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నప్పటినుంచి క్రికెట్ పై విపరీతమైన ఆసక్తి చూపించింది. క్రికెట్ ఆడటానికి తగిన సౌకర్యాలు లేకున్నా, తన ప్రతిభను ప్రతి అవకాశంలో నిరూపించుకుంటూ వచ్చింది.

Also Read: Maha kumbh mela: ముస్లింలతో మాకు శత్రుత్వం లేదు.. అయినా, కుంభమేళాలో షాపులు మాత్రం పెట్టుకోనివ్వం..

సుశీలా మీనాలోని ప్రతిభను చూసిన సచిన్ టెండూల్కర్ ఆమె బౌలింగ్ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో ఆమె బౌలింగ్ శైలీని శివంగి వంటి ఆకట్టుకునే విధంగా ఉండటంతో, సచిన్ తన మనసును చూరగొంది. ఈ వీడియో వైరల్ కావడంతో సుశీల గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఇటీవల రాజస్థాన్ పర్యటన సందర్భంగా సుశీలా మీనాతో సరదాగా క్రికెట్ ఆడారు. ఆ సందర్భంగా సుశీల వేసిన బంతిని ఆడడానికి ప్రయత్నించగా రాజవర్ధన్ సింగ్ రాథోడ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సమ్బన్ధినచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Ram Charan Fans: మృత్యువాత పడ్డ అభిమానుల ఇంటికి చరణ్ ఫ్యాన్స్

సుశీల ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. శిక్షణకు సంబంధించిన ఖర్చును కూడా అసోసియేషన్ భరిస్తోంది. మాజీ క్రికెటర్లు సుశీలా భవిష్యత్తుపై చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సుశీలా ఒక మట్టిలో పుట్టిన మాణిక్యం. సరైన శిక్షణ అందిస్తే ఆమె భారత మహిళా క్రికెట్ జట్టుకు భవిష్యత్ నాయకురాలిగా మారే అవకాశం ఉంది. ఆమె బౌలింగ్‌ శైలి చూస్తే దేశానికి గర్వించదగిన ఆటగాళ్లలో ఒకరిగా మారుతుందనే నమ్మకం ఉందని అంటున్నారు. సుశీలా మీనా తన ప్రతిభతోనే కాదు, తపనతో కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ప్రయాణంలో సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని సందేహమే లేదు.

Show comments