NTV Telugu Site icon

Ind vs WI: ఏందయ్యా.. మీరు ఇప్పుడైనా ఫామ్ లోకి రండి..

Wasim Jaffer

Wasim Jaffer

వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ గా టీమిండియా ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న బ్యాటర్లు తిరిగి పుంజుకోవడానికి ఫ్లోరిడా కంటే మంచి పిచ్‌ ఇంకొటి దొరకదని ఆయన అభిప్రాయపడ్డాడు. కనీసం ఇప్పుడైనా వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకుని మంచి స్కోర్లు సాధించాలని విజ్ఞప్తి చేశాడు.

Read Also: Ashu Reddy: వైట్ మినీ స్కర్ట్ డ్రెస్సులో అదరహో అనిపిస్తున్న అషు రెడ్డి

కాగా.. విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండింటిలో ఓడిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య కీలకమైన నాలుగో టీ20 నేడు (శనివారం) జరుగనుంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా హార్దిక్‌ పాండ్యా సేన రోవ్‌మన్‌ పావెల్‌ బృందంతో పోటీ పడనుంది. బ్యాటర్లకు ఫ్లోరిడా పిచ్‌ అనుకూలంగా ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు. అయితే.. సంజూ శాంసన్‌ రాణించాల్సి ఉంది.. హై స్కోరింగ్‌కు ఆస్కారం ఉన్న గ్రౌండ్‌ను భారత బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

Read Also: Sajjala Ramakrishna Reddy: దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ ఫోకస్

సంజూ శాంసన్ తో పాటు.. శుబ్‌మన్‌ గిల్‌, యశస్వీ జైశ్వాల్‌లకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి అని వసీం జాఫర్ తెలిపాడు. ఫామ్‌లేని ఆటగాళ్లు తిరిగి రిథమ్‌లోకి రావడానికి ఇలాంటి పిచ్‌లను వినియోగించుకోవాలని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌పై జాఫర్ ప్రశంసలు కురిపించాడు. సారథ్య బాధ్యతలు పావెల్ చక్కగా నిర్వర్తిస్తున్నాడని వసీం జాఫర్ పేర్కొన్నాడు. కాగా తాజా సిరీస్‌లో వెస్టిండీస్‌తో ఇప్పటి వరకు ఆడిన మూడు టీ20లలో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 3, 7, 6 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఇక సంజూ రెండు టీ20లలో వరుసగా 12, 7 రన్స్ మాత్రమే చేశాడు.