మాములుగా క్లాసులకు బంక్ కొట్టే విద్యార్థులు ఎంతో మంది ఉంటారు. సినిమాలకు, షికారులకు వెళ్లడానికి ఇలాంటి కథలు పడుతుంటారు. ఐతే మణిపూర్ లో జరిగిన ఘటన చూస్తే అవాక్కవాల్సిందే. తరగతులకు బంక్ కొట్టిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఏం కథ చెప్పారో విన్నారంటే ఆశ్చర్యపోతారు. టీచర్లు వారిని తిడుతారన్న భయంతో ఓ కథను సృష్టించారు. ఆ కథే ఇప్పుడు మణిపూర్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ శివార్లలో ఉన్న నంబోల్ పట్టణంలో బాలికలు పాఠశాలకు బంక్ కొట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారు.. తిడుతారనే భయంతో ముగ్గురు బాలికలు తమతో సహా 20 మంది విద్యార్థినులను.. పాఠశాలకు వస్తుండగా కిడ్నాప్ చేసినట్లు చెప్పారు.
Mandakrishna Madiga: రాజయ్య మంత్రి పదవి పోవడానికి పాత్రధారి, సూత్రధారి కడియం శ్రీహరే
అంతేకాకుండా.. కిడ్నాపర్లు తమను విహారయాత్రకు తీసుకెళ్తామని, వ్యాన్‌లో కూర్చోమని అడిగారని బాలికలు పోలీసులకు చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కిడ్నాపర్లు మాస్కులు ధరించి ఉన్నారని పేర్కొన్నారు. అయితే తమకు అనుమానం వచ్చి, అపహరణకు గురైన వెంటనే కదులుతున్న వాహనంపై నుంచి దూకినట్లు బాలికలు తెలిపారని సంబంధిత వర్గాలు అన్నారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారం మణిపూర్ లో కలకలం సృష్టించింది. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న అశాంతి గత కొన్ని నెలల్లో దాదాపు 170 మంది ప్రాణాలను బలిగొంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ఒకరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం టెన్షన్ వాతావరణం నెలకొంది.
Pawan Kalyan: బ్రో.. మళ్లీ ఇంకో రీమేకా.. అది కూడా ఆ డైరెక్టర్ తో.. ?
బాలికల కిడ్నాప్ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు.. వారి వాంగ్మూలాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. పాఠశాలకు బంక్ కొట్టిన విద్యార్థులు.. తప్పించుకునేందుకు ఇలాంటి కథను సృష్టించారని పోలీసులు తెలిపారు.
